సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (14:36 IST)

కూరగాయల తొక్కలను పడేస్తున్నారా... ఇలా చేస్తే...

చాలామంది కూరగాయలు, పండ్లు తొక్కలు పారేస్తుంటారు. ఈ తొక్కలు పడేయకుండా వాటిలో గల ఉపయోగాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం. బంగాళాదుంపల తొక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచుకుని ఆ

చాలామంది కూరగాయలు, పండ్లు తొక్కలు పారేస్తుంటారు. ఈ తొక్కలు పడేయకుండా వాటిలో గల ఉపయోగాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం. బంగాళాదుంపల తొక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచుకుని ఆ తరువాత కళ్లమీద ఉంచుకోవాలి. 15 నిమిషాల తరువాత కళ్లు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
అరటిపండు తొక్కలతో దంతాలను శుభ్రం చేసుకుంటే పళ్లు తెల్లగా మారుతాయి. వీటి ద్వారా దంతాలకు మెగ్నిషియం, మాంగనీస్, పొటాషియం అంది దంతాలు దృఢంగా ఉంటాయి. కమలాపండు తొక్కలను గుమ్మంలో, వంటింట్లో, గదులలో ఉంచితే దుర్వాసనలు తొలగిపోతాయి. ఈ తొక్కల్ని నీళ్లలో వేసి మరిగించి గది మధ్యలో ఉంచితే పరిమళం వెదజల్లినట్టు మంచి వాసన వస్తుంది. 
 
ఉల్లిపాయ పొట్టును పడేయకుండా వాటిని చెట్ల మెుదళ్లలో వేస్తే మెుక్కలకు సల్ఫర్ అందుతుంది. అంతేకాకుండా మెుక్కలు బాగా పెరుగుతాయి. పువ్వులు కూడా బాగా పూస్తాయి. కాబట్టి కూరగాయలు, పండ్లు తొక్కలను పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటే మంచిది.