గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (14:11 IST)

దోసపండును ఇలా ఉపయోగిస్తే..?

దోసపండు సౌందర్య పోషణకు ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వు కేశాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసపండ్ల రసం, కీరాల రసం చెరో టీ స్పూన్ చొప్పున కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం

దోసపండు సౌందర్య పోషణకు ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వు కేశాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసపండ్ల రసం, కీరాల రసం చెరో టీ స్పూన్ చొప్పున కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే పావు కిలో చొప్పున పెసరపప్పు, శీకాయలకు వందగ్రాములు, దోసగింజలు కలిపి, పిండి చేసుకోవాలి. వారానికోసారి ఈ పిండిని తలకు పట్టించుకుని తలస్నానం చేస్తే, జుట్టు మృదువుగా, మెరుపును సంతరించుకుంటుంది. 
 
ఇక దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వందగ్రాముల దోసగింజల పొడికి అంతే ఓట్స్‌ పొడి తీసుకుని, కీరాల రసంతో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను శరీరానికి రాసుకుని స్నానం చేయాలి. ఇలాచేస్తే తైలమర్దనం చేసుకుని అభ్యంగనస్నానం చేసినంత తాజాగా ఉంటుంది. సువాసనభరితంగానూ ఉంటుంది. ఓట్స్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. దోసగింజలు జుట్టుకు చక్కని కండిషనర్‌గా పని చేస్తుంది.  
 
పాల పొడి, దోసగింజల పొడి సమానంగా తీసుకుని, నీటిలో కలిపి, కళ్ల చుట్టూ పూతలా వేసుకుని.. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే  కళ్ల చుట్టూ ఉండే ముడతలు, నల్లని వలయాలు, అలసట పోయి, కళ్లు ప్రకాశవంతం అవుతాయి.