మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 26 జులై 2018 (13:50 IST)

బార్లీ నీటితో చెడు కొలెస్ట్రాల్ చెక్....

బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. కొవ్వును తగ్గించుటలో చాలా ఉపయోగపడుతాయి. బార్లీ నీరు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలను దూరంచేస్తాయి. చిన్న

బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. కొవ్వును తగ్గించుటలో చాలా ఉపయోగపడుతాయి. బార్లీ నీరు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలను దూరంచేస్తాయి. చిన్నపిల్లలకు ఈ నీటిని తాగించడం వలన మూత్రం చెడువాసన రాకుండా ఉంటుంది.
 
ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకుని అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి వాటిలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. తరువాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిది.
 
బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ విషపదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగును శుభ్రపరచి కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. శరీర వేడి గలవారు బార్లీ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
బార్లీలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ నీటిలో పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తరుచుగా తీసుకుంటే మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో చాలా ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. బీపీ కూడా అదుపులో ఉంటుంది.