1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:53 IST)

లో-బీపీ వున్నవారు చేమదుంపల్ని తింటే?

చేమదుంప రుచే వేరు. అంతేకాదు.. చేమదుంపలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. చేమదుంపల్లో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల హృద్రోగాలు బాధించవు. రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంద

చేమదుంప రుచే వేరు. అంతేకాదు.. చేమదుంపలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. చేమదుంపల్లో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల హృద్రోగాలు బాధించవు. రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి లభిస్తుంది. అది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఇది లో బీపీని దూరం చేస్తుంది. 
 
లో-బీపీ వున్నవారు పొటాషియం అధికంగా లభించే చేమదుంపలను తీసుకోవడం ద్వారా లో-బీపీ దూరమవుతుంది. ఈ దుంపల్లో గ్లూటెన్ వుండదు. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్లు శరీరంలో పీచు, యాంటీయాక్సిటెండ్ల మాదిరి పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు చేమదుంపలకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది. 
 
చేమదుంపల్లో కొవ్వు శాతం తక్కువ. ఇందులో సోడియం శాతం కూడా తక్కువే. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది శరీరంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఒమెగా 2 ఫ్యాటీ ఆమ్లాలు ఈ దుంపల్లో అధికంగా ఉంటాయి. ఆ పోషకం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆటలు ఆడే పిల్లలకు చేపదుంపల్ని తినిపించడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.