మొలల వ్యాధికి దివ్యౌషధం బీరకాయ..
బీరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బీరకాయలో సెల్యులోజ్ అధికంగా వుండటం ద్వారా మొలల వ్యాధిని ఇది నివారిస్తుంది. సాధారణ లేదా నేతి బీరకాయలో పీచు, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, థ
బీరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బీరకాయలో సెల్యులోజ్ అధికంగా వుండటం ద్వారా మొలల వ్యాధిని ఇది నివారిస్తుంది. సాధారణ లేదా నేతి బీరకాయలో పీచు, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, థైమీన్ వంటి పోషకాలు మెండుగా వుంటాయి. బీరకాయల్లోని ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి.
మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ బీరకాయ రక్షిస్తుంది. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడం ద్వారా మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
బీరలోని వ్యాధినిరోధక శక్తితో ఇన్ఫెక్షన్లు, అల్సర్లు దరిచేరవు. బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుంది. అంతేకాదు.. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.