గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (18:38 IST)

వేడి నీటిని తాగితే మధుమేహం రాదట..(video)

వేడి నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..? వేడినీటిని సేవిస్తే మధుమేహం రాదు. కీళ్ళనొప్పులుండవు. తద్వారా ఆర్థరైటీస్ సమస్యలుండవు. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. గొంతు సమస్యలను దూరం

వేడి నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..? వేడినీటిని సేవిస్తే మధుమేహం రాదు. కీళ్ళనొప్పులుండవు. తద్వారా ఆర్థరైటీస్ సమస్యలుండవు. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. గొంతు సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు దరిచేరవు. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు పెరగరు. తద్వారా ఒబిసిటీ సమస్య వుండదు. వేడి నీటిని సేవించడం ద్వారా ఒబిసిటీ సమస్య వుండదు. 
 
అయితే వేడి నీటిని ఎలా తాగాలంటే..  
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆ తర్వాత అల్పాహారానికి అర్థగంట తద్వారా ఓ గ్లాసుడు గోరువెచ్చని వేడి నీరు సేవించాలి. భోజనానికి తర్వాత, రాత్రి నిద్రించేందుకు గంట ముందు గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. అనవసరపు కొవ్వు కరుగుతుంది. 
 
వేడి నీరు శరీరానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుంది. శరీరాన్ని చురుకుగా వుంచుతుంది. అయితే వేడి నీటిని సిప్ చేస్తూ తాగాలి. గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.