దద్దుర్లతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే...
ఈ కాలంలో చాలామంది అలర్జీ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలర్జీలతో ఒళ్లంతా ఎరువు రంగు దద్దుర్లుగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
ఈ కాలంలో చాలామంది అలర్జీ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలర్జీలతో ఒళ్లంతా ఎరువు రంగు దద్దుర్లుగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
పడని ఆహారపదార్థాలు, మందులు, సౌందర్యసాధనలు, దుమ్ము, బూజూ వంటి వాటితోనే ఇలాంటి సమస్యలు మెుదలవుతాయి. ముఖ్యంగా వేరుశెనగలు, జీడిపప్పు, బాదం, చేపలు, గుడ్లు, చాక్లెట్లు, ఆహారంలో కలిపే రసాయనాలు కూడా అలర్జీలకు కారణం కావచ్చును. అందువలన వీటిలో ఎటువంటి పదార్థాలు అలర్జీలను దారితీస్తాయో వాటిని మానేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఆహారంలో అల్లం, మిరయాలు, మెంతులు, పుదీనా, నిమ్మరసం అధికంగా వాడాలి. మంచినీళ్లు, మజ్జిగా, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. స్పూన్ అల్లం తరుగులో పావు చెంచా సైంధవ లవణాన్ని కలుపుకుని పరగడుపున తీసుకోవాలి.
దద్దుర్లు వచ్చినప్పుడు సత్వర పరిష్కారం కోసం రాగిపాత్రలో చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఈ గుజ్జును మూడు గంటలు నానబెట్టుకుని దద్దుర్లకు, దురదలకు పూతలా వేసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.