గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (18:35 IST)

15ఏళ్ల బాలుడితో పంతులమ్మ ప్రేమ.. ఆపై జంప్.. రెండు రోజులు షికార్లు..

కలి ముదిరింది. ఎక్కడ చూసినా అక్రమాలు, నేరాలు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోభేదాలు లేకుండా ప్రేమ పుట్టుకొస్తుంది. తాజాగా పదో తరగతి పిల్లాడితో 29 ఏళ్ల స్కూల్ టీచర్ జంప్ అయ్యింద

కలి ముదిరింది. ఎక్కడ చూసినా అక్రమాలు, నేరాలు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోభేదాలు లేకుండా ప్రేమ పుట్టుకొస్తుంది. తాజాగా పదో తరగతి పిల్లాడితో 29 ఏళ్ల స్కూల్ టీచర్ జంప్ అయ్యింది. ఈ ఘటన హర్యానాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫతేబాద్‌లోని ఓ పాఠశాలలో 29ఏళ్ల పంతులమ్మ పాఠాలు బోధిస్తోంది. 
 
ఇంతలో తన వద్ద చదివే 15 ఏళ్ల పిల్లాడితో టీచరమ్మ ప్రేమలో పడింది. 15 ఏళ్ల బాలుడితో ప్రేమాయాణం సాగించింది. ఫోన్లో మెసేజీలు, వీడియోలు పంపుతూ ప్రేమపాఠాలు బోధించింది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుని.. శుక్రవారం ఇద్దరూ ఊరి నుంచి పారిపోయారు. 
 
సదరు బాలుడి తల్లిదండ్రులు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూలుకెళ్లి విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమజంట ఫోన్ల ఆధారంగా పోలీసులు వారు ఎక్కడున్నారో గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. తాము మొదట ఢిల్లీకి వెళ్లామని, తర్వాత కాశ్మీర్‌లో పర్యటించామని టీచర్ చెప్పింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగామని తెలిపింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.