ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (17:57 IST)

81 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడిన స్టూడెంట్.. సీపీఆర్ విధానం ద్వారా? (Video)

ఓ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రైల్వే స్టేషన్లో 81 ఏళ్ల వృద్ధుడు హఠాత్తుగా కింద పడిపోతే.. ఆ విద్యార్థిని చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు చేతులతో అతన

ఓ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రైల్వే స్టేషన్లో 81 ఏళ్ల వృద్ధుడు హఠాత్తుగా కింద పడిపోతే.. ఆ విద్యార్థిని చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు చేతులతో అతని ఛాతి మీద గట్టిగా నొక్కుతూ నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా దాదాపు అరగంట పాటు పోరాడి అతడికి ప్రాణం పోసింది. 
 
ఈ ఘటన చైనాలోని జింజూ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.  వృద్ధుడికి సీపీఆర్‌ విధానం ద్వారా ఆ యువతి ప్రాణం పోసింది. ఆ యువతి జింజూలోని మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ డింగ్‌ హుయ్‌గా గుర్తించారు. 
 
వృద్ధుడి ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమైన డింగ్‌ హుయ్‌ ఇంటికి వెళ్లాల్సిన ట్రైన్‌ని కూడా మిస్ చేసుకుంది. ప్రస్తుతం డింగ్ హుయ్ ఓ వృద్ధుడిని కాపాడిన వైనం వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరూ సదరు వీడియోను ఓ లుక్కేయండి.