శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 23 జులై 2018 (15:19 IST)

గాజులతో బ్రాస్‌లెట్ ఎలా చేయాలో చూద్దాం...

చాలామంది మహిళలు పాత గాజులు మనకెందుకని మారేస్తుంటారు. ఆ పాత గాజులతో రకరకాల బ్రాస్‌లెట్ తయారుచేసుకోవచ్చును. ఒక వేళ మీ ఇంట్లో కనుక పాత గాజులు ఉంటే వాటితో బ్రాస్‌లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

చాలామంది మహిళలు పాత గాజులు మనకెందుకని మారేస్తుంటారు. ఆ పాత గాజులతో రకరకాల బ్రాస్‌లెట్ తయారుచేసుకోవచ్చును. ఒక వేళ మీ ఇంట్లో కనుక పాత గాజులు ఉంటే వాటితో బ్రాస్‌లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
పలుచగా ఉండే పాత బ్యాంగిల్స్ - 4
చిన్న క్లాంప్స్ (షూ లేసుల చివర్లలలో ఉండేలాంటివి) - 2
పట్టుకార - తగినంత
లెదర్ లేస్ - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా 4 గాజులను సమానంగా పట్టుకోవాలి. ఇప్పుడు లెదర్ లేస్‌ను చిత్రంలో చూపిన విధంగా ఒక గాజు కిందనుండి మరోగాజు మీద నుండి తీసుకురావాలి. అల్లిక అంతా పూర్తి అయ్యాక చివర్లో మిగిలిన లెదర్‌ను కత్తింరించేయాలి. చివరలను గాజులకు సెట్‌చేసి క్రింప్స్‌ను పెట్టి పట్టుకారతో దగ్గర ఒత్తాలి. అంతే బ్రాస్‌లెట్ రెడీ.