మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (09:36 IST)

ఇంట్లోనే మెహెందీ ఎలా చేయాలో చూద్దాం....

మెహెందీ కోన్స్‌తో అరచేత అందమైన డిజైన్స్ తీర్చిదిద్దుకోవాలని ముచ్చటపడుతుంటారు. కాని చర్మ సమస్యలు వస్తాయేమో అనే భయం. అలాంటి భయాలేవీ లేకుండా ఇంట్లోనే కోన్‌ని ఎలా తయారుచేయాలో చూద్దాం.

మెహెందీ కోన్స్‌తో అరచేత అందమైన డిజైన్స్ తీర్చిదిద్దుకోవాలని ముచ్చటపడుతుంటారు. కాని చర్మ సమస్యలు వస్తాయేమో అనే భయం. అలాంటి భయాలేవీ లేకుండా ఇంట్లోనే కోన్‌ని ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
హెన్నా పొడి - 100 గ్రాములు
ఆర్గానికి గోరింటాకు పొడి 
డిస్టిల్డ్ ఎసెన్షియల్ ఆయిల్ - 30 ఎం.ఎల్
మంచినీళ్లు
పంచదార - 3 స్పూన్స్
 
తయారీ విధానం: ముందుగా పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్లను కలుపుకుంటూ ఆ మిశ్రమం చిక్కగా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ప్లాస్టికి షీట్‌తో పూర్తిగా మూసి 15 నిమిషాల పాటు అలానే పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అందులో మరికొన్ని నీళ్లు, ఎసెన్షియల్ ఆయిల్‌ను కలుపుకుని మళ్ళీ ప్లాస్టిక్ షీట్‌తో మూసి గండ పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత ప్లాస్టిక్ షీట్‌ని తీసేస్తే ఆ మిశ్రమంలో పొడి తాలుకు గడ్డలు లేకుండా మృదువుగా తయారవుతుంది.