శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (09:27 IST)

చెన్నై చెవిటి బాలికపై తొలిగా రేప్‌ చేసిన 66ఏళ్ల వృద్ధుడు

చెవిటి 12 యేళ్ళ చెవిటి బాలికపై 24 మంది అత్యాచారం చేసిన ఘటన చెన్నై మహానగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ బాలికపై క్వార్టర్స్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల వృద్ధుడే తొలిసారి రేప్ చేసినట్టు బ

చెవిటి 12 యేళ్ళ చెవిటి బాలికపై 24 మంది అత్యాచారం చేసిన ఘటన చెన్నై మహానగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ బాలికపై క్వార్టర్స్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల వృద్ధుడే తొలిసారి రేప్ చేసినట్టు బాధిత బాలిక చెప్పింది. లిఫ్ట్‌ ఆపరేటర్ ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు సహా మొత్తం 24 మంది ఏళ్ళతరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు.
 
బాధిత తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై నగర పోలీసులు.. ఇప్పటికే 17 మంది కామాంధులను అరెస్టు చేశారు. అలాగే, సోమవారం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసు కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. అక్కడ నిందితులను ఆమె గుర్తించింది. తనతో ఎవరెవరు ఎంత అమానుషంగా ప్రవర్తించారనేది పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం ఆమెను హైకోర్టుకు తీసుకెళ్లారు. నిందితులకు చట్టప్రకారం తప్పకుండా శిక్ష పడుతుందని మద్రాస్‌ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ వ్యాఖ్యానించారు.