ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (09:11 IST)

చెవిటి బాలికపై 24 మంది అత్యాచారం ఎలా చేశారంటే..

ముక్కుపచ్చలారని 12 సంవత్సరాల చెవిటి బాలికపై 24 మంది కామాంధులు అఘాయిత్యం చేశారు. ఈ మృగాల్లో వృద్ధుడి నుంచి 20 యేళ్ళ యువకుల వరకు ఉన్నారు. వీరంతా వంతులవారీగా ఏడు నెలలపాటు అత్యాచారం జరిపారు. ఆ అత్యాచార దృ

ముక్కుపచ్చలారని 12 సంవత్సరాల చెవిటి బాలికపై 24 మంది కామాంధులు అఘాయిత్యం చేశారు. ఈ మృగాల్లో వృద్ధుడి నుంచి 20 యేళ్ళ యువకుల వరకు ఉన్నారు. వీరంతా వంతులవారీగా ఏడు నెలలపాటు అత్యాచారం జరిపారు. ఆ అత్యాచార దృశ్యాలను వీడియో తీసి.. ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ బాలిక భయంతో వణికిపోతూ.. వారి పశుత్వాన్ని భరిస్తూ వచ్చింది. ఆఖరికి ఆమె అక్క గమనించడంతో చాలా ఆలస్యంగా బయటపడింది. ఆ బాలికపై అత్యాచారం జరిపిన 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఏడుగురి కోసం గాలిస్తున్నారు. వారిపై పోక్సో చట్టం కింద, హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
ఈ బాలికపై ఈ కామాంధులు ఎలా అత్యాచారం చేశారంటే... తొలుత అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత ఆ బాలికకు చూపెట్టి తమ మాట వినకపోతే ఆ వీడియోను అందరికీ చూపిస్తామంటూ బెదిరించారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ పసిమొగ్గ వారు చెప్పినట్టే నడుచుకునేది. 
 
ఈ క్రమంలో ఆ బాలికను వారు ప్రతిరోజూ తమ వెంట తీసుకెళ్లేవారు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఓ గదిలోకి తీసుకెళ్లేవారు. అక్కడ శీతలపానీయంలో మత్తుపొడి కలిపి ఒకసారి, ఘాటైన డ్రగ్స్‌ ఇచ్చి మరోసారి.. ఇలా కొన్నివారాల పాటు ఆమెను ఛిద్రం చేశారు. ఆ క్వార్టర్స్‌లో పనులు చేస్తున్న ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు కూడా వీరితో చేరి, ఆ చిన్నారికి నరకం చూపించారు. ఇలా 7 నెలల పాటు ఆ బాలిక నరకం అనుభవించింది. 
 
వాస్తవానికి ఆ బాలిక ఏడో తరగతి చదువుతోంది.ఆమె అక్కయ్య ఢిల్లీలో చదువుతోంది. పుట్టినప్పటి నుంచి వినికిడిలోపం ఉన్న బాధిత బాలిక.. రోజూ పైఅంతస్థు నుంచి కిందికి లిఫ్టులో వచ్చి.. స్కూల్‌వ్యాన్‌లో పాఠశాలకు వెళ్లేంది. అలా లిఫ్ట్‌లో వచ్చి వెళ్లేటపుడు లిఫ్ట్‌ ఆపరేటర్‌ రవికుమార్‌ (66) ఆ బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆపై అత్యాచారం జరిపాడు. విషయాన్ని బయటపెడితే కత్తితో పొడుస్తానని బెదిరించాడు.
 
తాను చేసిన పాడుపనిని క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. దీంతో తమకు కూడా ఆ బాలికను అప్పగించాలని వారు కోరారు. ఒకరోజు స్కూలు వ్యాన్‌ దిగిన బాలికను రవికుమార్‌ తన వెంట లిఫ్ట్‌ వద్దకు బలవంతంగా తీసుకెళ్లాడు. అదే క్వార్టర్స్‌లో ఖాళీ ఉన్న ఓ గదిలోకి నెట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆమెకు మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై గార్డులు, రవికుమార్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ముక్కుపచ్చలారని ఆ బాలిక జీవితాన్ని 24 మంది కామాంధులు ఛిద్రం చేశారు.