శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (15:48 IST)

చిన్నారి హాసిని రేప్ - హత్య కేసు : చెన్నై టెక్కీకి ఉరిశిక్ష

చెన్నై నగర శివారు ప్రాంతమైన పోరూరుకు చెందిన చిన్నారి హాసిని హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. చైన్నై, పోరూరుకు సమీపంలోని మౌలివాక్కంకు చెందిన బా

చెన్నై నగర శివారు ప్రాంతమైన పోరూరుకు చెందిన చిన్నారి హాసిని హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. చైన్నై, పోరూరుకు సమీపంలోని మౌలివాక్కంకు చెందిన బాబు అనే వ్యక్తి కుమార్తె హాసిని అనే ఆరేళ్ళ చిన్నారిని గత 2017 ఫిబ్రవరి 5వ తేదీన అదే ప్రాంతానికి చెందిన దశ్వంత్ అనే 24 యేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ చేశాడు. 
 
ఆ తర్వాత అత్యాచారం చేశాక చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనిపై మాంగాండు పోలీసులు కేసు నమోదు చేసి దశ్వంత్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన దశ్వంత్... హాసిని తల్లిని కూడా హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దోచుకుని ముంబైకు పారిపోయాడు. 
 
ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం ముంబైకు పంపించారు. ముంబైలో నిందితుడిని అరెస్టు చేసి చెన్నైకు తీసుకొచ్చి పుళల్ సెంట్రల్ జైలులో బంధించారు. ఈ హత్య కేసులో దశ్వంత్‌ తరపున వాదించేందుకు ఏ ఒక్క లాయర్ ముందుకు రాకపోవడంతో తన కేసును తానే వాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. 
 
ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను విచారించారు. అలాగే, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. దశ్వంత్‌ను ముద్దాయిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. అలాగే, హాసిని తల్లి హత్య కేసులో ఒకటి రెండు రోజుల్లో చార్జిషీటును దాఖలు చేయనున్నారు.