మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:48 IST)

#SRMPublicSchool : విద్యార్థుల అభీష్టం మేరకే విద్యనభ్యసించాలి : ఐజీపీ మురుగన్

విద్యార్థుల ఇష్టమేరకే విద్యనభ్యసించేలా సహకరించాలని తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఐజీపీ/డెరెక్టర్ డాక్టర్ ఎస్. మురుగన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చెన్నై మహానగరంలోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్ఆర

విద్యార్థుల ఇష్టమేరకే విద్యనభ్యసించేలా సహకరించాలని తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఐజీపీ/డెరెక్టర్ డాక్టర్ ఎస్. మురుగన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చెన్నై మహానగరంలోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్ఆర్ఎం గ్రూపునకు చెందిన ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ తొలి వార్షికోత్సం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మురుగన్ మాట్లాడుతూ, తాను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతుని ఐపీఎస్ అయినట్టు గుర్తు చేశారు. చదివే విద్యాసంస్థతో పనిలేదనీ, విద్యార్థుల అభీష్టం మేరకు విద్యనభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ముఖ్యంగా చిన్న వయసు నుంచే విద్యార్థులను ఒత్తిడి గురిచేయరాదని, వారికి ఇష్టమైన సబ్జెక్టులోనే రాణించేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.
 
కాగా, ఎస్ఆర్‌ఎం పబ్లిక్ స్కూల్ తొలి వార్షికోత్సవం నగర శివారు ప్రాంతమైన కాంట్టాన్‌కుళత్తూరులోని ఎస్ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలోని టీపీ గణేశన్ ఆడిటోరియంలో జరిగింది. ఈ వేడుకలు తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. చెంగల్పట్టులోని ప్రసాన్ విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రభ జ్యోతి, ఇతర ప్రముఖులు ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ఎంఆర్ఎం స్కూల్ ప్రిన్సిపాల్ వసుమతి శ్రీనివాస్ వార్షిక నివేదికను చదివారు. ముఖ్యంగా, గత సంవత్సరకాలంలో పాఠశాల విద్యార్థుల సాధించిన ప్రగతిని ఆమె తన నివేదికలో వివరించారు. ఈ కార్యక్రమాన్ని మణిమంగై సత్యనారాయణన్ నిర్వహించగా, ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్.మురుగన్, ఎస్ఆర్ఎం ట్రస్ట్ డైరెక్టర్ సత్యనారాయణన్ తదితరులు పాల్గొన్నరు.
 
ఈ వార్షికోత్సవం సందర్భంగా కిండర్ గార్డెన్ విద్యార్థులు వివిధ రకాల డాన్స్, మ్యూజికల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థులు నిర్వహించిన ఇన్నోవేషన్ డాన్స్ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత టేల్ ఆఫ్ విషెస్, ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా, వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎస్. మురుగన్, డైరెక్టర్ సత్యనారాయణన్‌లు షీల్డ్స్ బహుకరించారు.