సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 18 జులై 2018 (17:25 IST)

పుదీనా ఆకులతో నల్లటి వలయాలకు చెక్.....

అధిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదేపనిగా స్మార్ట్‌ఫోన్స్ వాడడం వంటివన్నీ కళ్లకింద నల్లటి వలయాలకు కారణమవుతాయి. ఆ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాలు.

అధిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదేపనిగా స్మార్ట్‌ఫోన్స్ వాడడం వంటివన్నీ కళ్లకింద నల్లటి వలయాలకు కారణమవుతాయి. ఆ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాలు.
 
టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కళ్లకింద రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే కళ్లకింద వలయాలు తగ్గుముఖం పడుతాయి. విటమిన్ సి శరీరపు రంగుని మెరుగుపరుస్తుంది. అందులోను నిమ్మజాతికి ఈ గుణం అధికంగా ఉంటుంది. బత్తాయి రసంలో కాస్త గ్లిజరిన్ కలుపుకుని నల్లగా ఉన్నచోట సున్నితంగా రాసుకోవాలి.
 
10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో ఇలా మూడు సార్లు చేయడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. గ్రీన్ టీని 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత కళ్లమీద పెట్టుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది. పుదీనా ఆకులు గుప్పెడు తీసుకుని కొద్దిగా నీళ్లను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
ఆ మిశ్రమాన్ని నల్లటి వలయాలకు రాసుకుని ఆరిక తరువాత కడిగేయాలి. పాలని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచుకున్న తరువాత దూదిని అందులో ముంచి కళ్లకింద మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన నల్లటి వలయాలు సులభంగా తొలగిపోతాయి.