వ్యాధినిరోధక శక్తికి మునగాకును తీసుకుంటే? (video)
మాంసకృత్తులు, విటమిన్స్, ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఇవన్నీ లభిస్తాయిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో క్యాల్షియ
మాంసకృత్తులు, విటమిన్స్, ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఇవన్నీ లభిస్తాయిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో క్యాల్షియం, ఇనుముతో పాటు ఇతర ఆరోగ్యకరమైన మాంసకృతులు విలువైన ఖనిజాలు అధికమోతాదులో లభిస్తాయి.
ఎముకలు దృఢంగా మారేందుకు సహాయపడుతాయి. పిల్లల్లో ఎముక సాంద్రత పెంచేందుకు దోహదపడుతాయి. మునగాకు గింజలలో రక్తశుద్ధికి తోడ్పడే లక్షణాలు ఉన్నాయి. మధుమేహ బాధితులు మునగాకును ఆహారంగా తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. గాల్‌బ్లాజర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
మునగాకు ఆకులలో, పువ్వులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి అధికమోతాదులో లభించడం వలన ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వలన నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి. గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మునక్కాయలను తరచుగా తీసుకుంటే మంచిది. శరీర వ్యర్థాలను బయటకు పంపించగల శక్తి మునగాకుకి ఉంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మునగాకును సూప్‌గా తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునక్కాయను తప్పనిసరిగా తీసుకోవాలి.