గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (15:59 IST)

ప్రతిరోజూ అల్లం టీ తీసుకుంటే?

ఈ కాలంలో కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండాలంటే అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కప్పు నీటిలో కొద్ది

ఈ కాలంలో కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండాలంటే అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీపొడి వేసి మరగబెట్టి వడగట్టుకోవాలి. తరువాత అందులో కాస్త తేనె, నిమ్మరసం కలపాలి.
 
ఉదయాన్నే ఈ టీని తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది. అజీర్తి సమస్య కూడా ఉండదు. పాలతో చేసిన టీలో కూడా కాస్తంత అల్లం ముక్కను వేసి వడకట్టి తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంచుటలో సహాయపడుతాయి. అనారోగ్యాలు దరిచేరకుండా ఉపయోగపడుతాయి.
 
అల్లంలో ఉండే విటమిన్స్, ఖనిజాలు, అమినోయాసిడ్లు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించుటకు దోహదపడుతుంది. అధికబరువు సమస్యను అదుపులో ఉంచుతుంది. హృద్రోగాలు రాకుండా ఉంటాయి. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పిని కూడా అరికట్టగలిగే గుణం అల్లంలో ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.