పాదాల పగుళ్లకు... నిమ్మరసంలో కాస్త ఉప్పును కలిపి రాసుకుంటే?
కాళ్ల పగుళ్లు మీద చాలామంది దృష్టి పెడుతుంటారు. కానిపాదం పైభాగంలోనూ మురికి, జిడ్డు పేరుకుపోతుంటుంది. అది తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. బంగాళాదుంప ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసుక
కాళ్ల పగుళ్లు మీద చాలామంది దృష్టి పెడుతుంటారు. కానిపాదం పైభాగంలోనూ మురికి, జిడ్డు పేరుకుపోతుంటుంది. అది తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. బంగాళాదుంప ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. అందులో దూదిని ముంచి కాళ్లను తుడవాలి. తరువాత ఆ రసాన్ని పాదాలకు పట్టించాలి. కాసేపటి తరువాత బంగాళాదుంప ముక్కతో రుద్ది కడిగేస్తే మురికి తొలగి కాళ్లు శుభ్రపడుతాయి.
కమలా పండు తొక్కల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు చెంచాల తీసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పాదాల మీద మర్దన చేసుకుని ఆరాక చల్లని నీటితో కడుక్కుంటే మురికిపోతుంది. నిమ్మరసంలో ఉప్పును చేర్చి పాదాలకు మర్దన చేసుకోవాలి. గోళ్ల మీద కూడా ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. టమోట రసంలో కాస్త పసుపును కలిపి పాదాలకు రాసుకుంటే నలుపుదనం తొలగిపోతుంది.
ఇలా చేయడం వలన గోళ్లు చుట్టూ ఉండే మట్టి తొలగిపోతుంది. చర్మం మీద మురికి కూడా తొలగిపోతుంది. కాసేపటి తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కప్పు నీళ్లలో బాదం గింజలు నానబెట్టుకోవాలి. మర్నాడు వాటిని మెత్తగా రుబ్బి కాళ్లకు పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత నిమ్మరసంతో తడిపి మర్దన చేస్తే నిర్జీవంగా మారిన చర్మానికి కొత్త కాంతి వస్తుంది.