శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:55 IST)

గోరింటాకు కషాయంతో లాభాలా? ఏంటవి?

గోరింటాకు కేవలం అలంకరణ కోసమే కాదు. ఇందులో చాల ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఈ గోరింటాకును ఎక్కువగా వర్షాకాలంలో పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే ఆడవారంతా గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరం చల్లబడి వివిధ రకాల క్

గోరింటాకు కేవలం అలంకరణ కోసమే కాదు. ఇందులో చాల ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఈ గోరింటాకును ఎక్కువగా వర్షాకాలంలో పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే ఆడవారంతా గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరం చల్లబడి వివిధ రకాల క్రిముల వలన కలిగే సమస్యల నుండి గోర్లని, అరచేతుల్ని, అరికాళ్ళని  కాపాడుకోవడం కొరకు ఆచరిస్తారు.
 
ఇది ఎక్కువగా అర చేతులు, అరి కాళ్ళు నుండి శరీరం లోకి ప్రవేసిస్తుంది. శరీరంలో వేడి తగ్గించడానికి గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా పెట్టుకోవచ్చు.
 
గోరింటాలను మెత్తగా నూరి రాత్రివేళ అరికాళ్లకు పట్టిస్తే పాదాల మంటలు తగ్గుతాయి. గోరింటాకు కషాయంలా కొంచెం కాచుకుని కొంచెం మాచికాయ చూర్ణం కలిపి పుక్తిలిస్తే నోటి అల్సర్లు పోతాయి. గోరింటాకు రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి తైలం మాత్రమే మిగిలేలా సన్నటి మంటపై కాచి ఆ తైలాన్ని తలకు మర్దన చేస్తే తలవెంట్రుకల కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది.
 
ఆకులను నూరి ముద్దగా చేసి బెణుకులపై కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. గోరింటాకు రసాన్ని గాని, నూరిన ముద్దను గాని నూనెలో కలిపి నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గోరింటాకును పసుపుతో కలుపుకుని ముద్దగా నూరి లేపనంగా వేస్తే చీము పట్టిన పుండ్లు సైతం మానిపోతాయి.