శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (13:16 IST)

కొత్తిమీర తీసుకుంటే.. కిడ్నీ సమస్యలు ఆమడదూరం..

కొత్తిమీరలో వున్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే.. తప్పకుండా వాడని వారు కూడా వంటల్లో వాడేస్తారు. కొత్తిమీరను కేవలం రుచి, సునాసన కోసమే కాదు.. కొత్తిమీరలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... కొత్తి

కొత్తిమీరలో వున్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే.. తప్పకుండా వాడని వారు కూడా వంటల్లో వాడేస్తారు. కొత్తిమీరను కేవలం రుచి, సునాసన  కోసమే కాదు.. కొత్తిమీరలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... కొత్తిమీర కాలేయానికి మేలు చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్‌-బి కాంప్లెక్స్‌కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. 
 
కొత్తిమీరలోని విటమిన్-సి.. యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ప్రాణాంతక క్యాన్సర్‌ను కూడా ఇది దూరం చేస్తుంది. చర్మానికి నిగారింపును ఇస్తుంది. చర్మాన్ని ముడత బారి నుంచి రక్షిస్తుంది. నిత్యయవ్వనంగా ఉంచడానికి కొత్తిమీర ఎంతగానో సహాయం చేస్తుంది.
 
కొత్తిమీరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు... తాము తినే అన్ని పదార్థాల్లో కొత్తిమీరను తప్పక తీసుకోవాలి. అలాగే కొత్తిమీరలోని పొటాషియమ్‌ రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెజబ్బులనూ అరికడుతుంది. 
 
కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారిస్తుంది. మెగ్నీషియమ్, జింక్‌ వంటి ఖనిజాలు కొత్తిమీరలో చాలా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరుపుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్‌ కూడా ఎక్కువ. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.