1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Hing health benefits for the teeth and ear pains

ఇంగువను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

ఇంగువను వేడిచేసి పుచ్చి పంటిలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తేనెలో కొద్దిగా ఇంగువను కలుపుకుని పిల్లల్లకు నాకిస్తే కడుపు ఉబ్బరం సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. అరగ్రాము ఇంగువను ఆవు నెయ్యిలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 10 గ్రాముల

hing
ఇంగువను వేడిచేసి పుచ్చి పంటిలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తేనెలో కొద్దిగా ఇంగువను కలుపుకుని పిల్లల్లకు నాకిస్తే కడుపు ఉబ్బరం సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. అరగ్రాము ఇంగువను ఆవు నెయ్యిలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 10 గ్రాముల హారతి కర్పూరంలో 10 గ్రాముల ఇంగువను వేసి వేడినీటిలో కలుపుకుని తీసుకుంటే ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
ఇంగువను నీళ్లల్లో కరిగించి ముక్కులో 3 చుక్కలు వేసుకుని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. ఇంగువ, సైందవ లవణం, శొంఠి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని 30 గ్రాముల ఆవనూనెలో కలుపుకోవాలి. చెవినొప్పితో బాధపడేవారు ఈ నూనెను వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. ఇంగువను మంచినీళ్లలో అరగదీసి ఆ గంధాన్ని కాలిన చోటు లేపనంగా వేస్తే కాలిన గాయలు, బొబ్బలు మానిపోతాయి. 
 
పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమవుతాయి. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తరవాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
 
ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధం. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఇంగువ చూర్ణం తీసుకోవాలి. కడుపులో పురుగులు ఉంటే ఇంగువను నీళ్లలో కలిపి తీసుకోవాలి. రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
మెులకెత్తిన గింజలు తింటుంటాం కదా... వాటిలో ఏముంటాయో తెలుసా?