శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (12:07 IST)

వంశం సీరియల్ నటి ప్రియాంక ఆత్మహత్య.. భర్తతో విభేదాలే కారణమా?

కోలీవుడ్‌ బుల్లితెర నటీమణుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వంశం సీరియల్ ఫేమ్ ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో ఏర్పడిన విభేదాలు ఆమె ఆత్మహత్యకు కారణమై వుంటాయని తెలుస్తోంది.

కోలీవుడ్‌ బుల్లితెర నటీమణుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వంశం సీరియల్ ఫేమ్ ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో ఏర్పడిన విభేదాలు ఆమె ఆత్మహత్యకు కారణమై వుంటాయని తెలుస్తోంది. 
 
చెన్నై, వళసరవాక్కంలోని ఆమె ఇంట్లో ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
 
గత కొంతకాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోందని, కుటుంబ విభేదాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వంశం సీరియల్‌లో ప్రియాంక జోతిక క్యారెక్టర్‌ను పోషించింది. వంశంలో బాహుబలి శివగామి రమ్యకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.