శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (09:11 IST)

కొత్త అమ్మాయిని నమ్మి రూ.కోట్లు ఖర్చెడతారా? అందుకోసమే లొంగిపోతున్నారు...

ఏ నిర్మాత అయినా కొత్త అమ్మాయిని నమ్మి రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారా? ఏ ఒక్క నిర్మాత కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకురారని సినీ నటి సంజన అభిప్రాయపడుతోంది. అదేసమయంలో వెండితెరపై కనిపించాలన్న కోట

ఏ నిర్మాత అయినా కొత్త అమ్మాయిని నమ్మి రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారా? ఏ ఒక్క నిర్మాత కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకురారని సినీ నటి సంజన అభిప్రాయపడుతోంది. అదేసమయంలో వెండితెరపై కనిపించాలన్న కోటి ఆశలతో ఫిల్మ్ నగర్‌లో అడుగుపెట్టే అమ్మాయిలు అవకాశాలు లేక పక్కదార్లు తొక్కుతున్నారని చెప్పింది. అయితే, ఇక్కడ అమ్మాయిలది తప్పులేదన్నారు.
 
ఇటీవలి కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె స్పందిస్తూ, కొత్త అమ్మాయిని నమ్మి కోట్లకొద్ది ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. ఆ విషయం గమనించకుండా ఎదుటివారి మాటలకు తేలిగ్గా లొంగిపోతే ఆ తర్వాత ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ అలా మోసపోతున్న అమ్మాయిలది తప్పు అనడం లేదు. మోసం చేసేవారున్నారు జాగ్రత్తగా ఉండమని చెబుతున్న అని సలహా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తుంటారు. కానీ వారూహించినంత సులువుగా ఇక్కడ అవకాశాలు రావని చెప్పారు. తమ కలలు, ఆశలు తీరకపోయేసరికి అమ్మాయిలు తీవ్రమైన నిరాశానిస్పృహలకు గురవుతారనీ, అలాంటివారిని ఈ రంగంలోని కొందరు వ్యక్తులు తేలిగ్గా లోబరచుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఇలాంటివారితోనే జాగ్రత్తగా ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు.