బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (11:59 IST)

భార్య గర్భం దాల్చినప్పుడు గృహనిర్మాణం చేపట్టవచ్చా?

భార్య గర్భం దాల్చినప్పుడు గృహ నిర్మాణం చేపట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భార్య గర్భిణిగా ఉండి 5 నెలలు దాటాక గృహ ప్రవేశంగాని, నిర్మాణంగాని నిషేధమని వాస్తు చెపుతోంది. అలాగే రాత్రిపూట శంఖుస్థాపన గాని, గృహ నిర్మాణపు పని ప్రారంభం కానీ చేయరాదు. మె

భార్య గర్భం దాల్చినప్పుడు గృహ నిర్మాణం చేపట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భార్య గర్భిణిగా ఉండి 5 నెలలు దాటాక గృహ ప్రవేశంగాని, నిర్మాణంగాని నిషేధమని వాస్తు చెపుతోంది. అలాగే రాత్రిపూట శంఖుస్థాపన గాని, గృహ నిర్మాణపు పని ప్రారంభం కానీ చేయరాదు. మెుదటి జాము, నాలుగో జాము సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చే విధంగా ఇంటి నిర్మాణం ఉండాలి.
 
గృహావరణలో వెలువడే సూర్యకాంతిలో రాత్రి వెన్నెల ప్రసరించాలి. ఆవరణలోని ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, పశ్చిమ దిశలలో గోతులుగాని, గుంతలు గానీ ఉండకూడదు. ప్రహరీ కట్టి ఈశాన్యాన బావి తవ్విన తరువాతనే గృహ నిర్మాణానికి ఉపక్రమించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.