గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (16:02 IST)

రేణూకి పెళ్లి: చెర్రీ ఏడ్చేశాడా? ఇక పవన్ వద్దే అకీరా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫిలిమ్ నగర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేణూ దేశాయ్ పెళ్లి గురించి పెద్ద చర్చ సాగుతోంది. రేణూ దేశాయ్ ప

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫిలిమ్ నగర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేణూ దేశాయ్ పెళ్లి గురించి పెద్ద చర్చ సాగుతోంది. రేణూ దేశాయ్ పెళ్లిపై మెగా హీరోలు ఏమనుకుంటున్నారు.. మెగా ఫ్యామిలీ రేణూ పెళ్లిపై ఎలా స్పందిస్తుందనే దానిపై మీడియా కవరేజ్‌లు చేస్తుంది. 
 
ఈ క్రమంలో రేణూదేశాయ్ పెళ్లిపై పవన్ శుభాకాంక్షలు తెలిపారు. చెర్రీ రేణూను పిన్ని అని పిలవలేమని ఏడ్చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రేణు దేశాయ్ వద్ద పెరుగుతున్న అకీరాను తన వద్దకు పంపించేయాలని పవన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అందుకే అకీరా పవన్‌ కోసం హైదరాబాద్ వచ్చేశాడని.. ఇక రేణూ వద్దకు వెళ్లే ప్రసక్తే వుండదని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.  
 
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లాడబోయే వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే ఆమె మరో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో రేణు పెళ్లి చేసుకోబోతుండటంపై కుమారుడు అకీరా అప్‌సెట్ అయ్యాడనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. తన రెండో పెళ్లి గురించి అకీరా అప్‌సెట్ అయ్యాడని కొందరు ఆరోపిస్తున్నారు.
 
అకీరా అప్ సెట్ అయిన మాట నిజమేనని చెప్పారు. అయితే, అకీరా అప్‌సెట్ అయింది పెళ్లి గురించి కాదని... మెన్యూలో పన్నీర్ బటర్ మసాలా లేకపోవడంతోనేనని ఫన్నీగా చెప్పారు.