శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (12:48 IST)

మాజీ భార్యకు పవన్ బెస్ట్ విషెస్.. హ్యాపీగా లేనంటున్న రేణు

హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్, హీరోయిన్ రేణూ దేశాయ్‌లు ఒకరినొకరు అర్థం చేసుకుని సహజీవనం చేశారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఆద్య‌, అకీరా అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే కొన్నేళ్ళ క్రితం ప‌వ‌న్ నుండి వ

హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్, హీరోయిన్ రేణూ దేశాయ్‌లు ఒకరినొకరు అర్థం చేసుకుని సహజీవనం చేశారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఆద్య‌, అకీరా అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే కొన్నేళ్ళ క్రితం ప‌వ‌న్ నుండి విడిపోయిన రేణూ ప్ర‌స్తుతం త‌న పిల్ల‌ల‌తో పూణేలో విడిగా నివశిస్తోంది.
 
ఆ మ‌ధ్య త‌న భావోద్వేగాల‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెబుతూ త‌న‌కి ఓ తోడుకావాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపింది. తాను ప్రేమ వివాహం, సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అస్సలు వివాహమాడనని చెప్పుకొచ్చింది. అయితే తన రెండో పెళ్లి విషయంలో పవన్ ఓ సలహ కూడా ఇచ్చాడని రేణూ తెలిపింది. 
 
అంతేనా, త‌న పెళ్లి విషయం గురించి తెలుసుకున్న పవన్ ఓ రోజు త‌న‌కి కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి.. భాగస్వామి ఎంపికలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించమని, అతని గురించి అన్నీ తెలుసుకున్నాకే తదుపరి అడుగు వేయమని చెప్పారని రేణూ అప్ప‌ట్లో అంది. 
 
అపుడు చెప్పినట్టుగానే ఇపుడు రేణూ దేశాయ్ ఓ వ్యక్తిని వివాహమాడనుంది. వారిద్దరి నిశ్చితార్థం కూడా తాజాగా జరిగింది. అయితే, తనకు కాబోయే వ్యక్తి గురించిన వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ, నిశ్చితార్థ ఫోటోను మాత్రం బహిర్గతం చేసింది. అదేసమయంలో వీరి పెళ్లి ఎపుడన్నది కూడా తెలియలేదు. 
 
ఏది ఏమైనా... తన మాజీ భార్యకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "ఆనందంగా కొత్త జీవితంలోకి ప్ర‌వేశిస్తున్న రేణూ గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. భ‌గ‌వంతుడు ఆమెకి సంప‌న్న జీవితం, శాంతి, ఆరోగ్యం, శ్రేయ‌స్సుని అందివ్వాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని ట్వీట్‌లో తెలిపారు. ప‌వ‌న్ ఇంత హుందాత‌నంతో శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం పట్ల ఆయ‌న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, రేణూకి వారు కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.
 
అదేసమయంలో ఈ నిశ్చితార్థం వివాహంపై రేణూ కూడా ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తాను ఇపుడు చేసుకోబోయేది ప్రేమ వివాహం కాదని తెల్చిచెప్పింది. అలాగనీ, తాను ఎంపిక చేసుకున్నది కాదనీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి కుదిర్చిన పెళ్లి అంటూ వివరించారు. అయితే, తనకు కాబోయే భర్త గురించిన వివరాలు మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. 
 
"ఇది పూర్తిగా స‌న్నిహితులు కుదిర్చిన పెళ్లి. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అంత ఆతృత‌ మాత్రం లేదు. ప్రేమ అనేది జీవితంలో ఒక‌సారే క‌లుగుతుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌డం జ‌ర‌గ‌దు. గ‌త ఏడేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నాను. అప్పుడూ సంతోషంగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నా నేను అంతే సౌక‌ర్యంగా ఉండ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఆయ‌న చాలా ప్ర‌శాంత‌మైన వ్య‌క్తి. మ‌ళ్లీ స‌హ‌జీవ‌నం చేయాల‌ని నేను అనుకోలేదు. అందుకే సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నాన"ని రేణు చెప్పారు. 
 
ఇకపోతే, పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన నిర్మాత బండ్ల గణేష్ కూడా రేణూ నిశ్చితార్థంపై స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. 'మా బాస్ అంటే ఇది' అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.