శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (14:51 IST)

జగన్‌తో కలిస్తే జనసేన మటాష్ : సీపీఐ నేత రామకృష్ణ

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధిన

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో  వైకాపా - జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్యాసంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందన్నారు.
 
కానీ, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచేశారని విమర్శించారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అదేసమయంలో వైసీపీతో చేతులు కలిపితే జనసేన కథ ముగిసినట్టేనని చెప్పారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుని నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.