బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (14:39 IST)

అక్కినేని నాగార్జున ఫామ్‌హౌస్‌లో విషాదం... ఏం జరిగిందంటే...

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫామ్ హౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే హీరో నాగార

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫామ్ హౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే హీరో నాగార్జున హుటాహుటిన తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
 
నాగార్జునకు హైదరాబాద్ నగర శివార్లలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఇందులో వ్యవసాయ పనులను తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) అనే దంపతులు చేస్తున్నారు. 
 
అయితే, ఆదివారం రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్‌ను గమనించక దాన్ని తాకాడు. కరెంట్ షాక్‍తో భర్త విలవిల్లాడుతుంటే, అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 
 
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కూలీల మృతిపై నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.