బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (13:41 IST)

బంధంపై నమ్మకం లేదు.. సో పెళ్లికి దూరం.. కానీ మగతోడు ఉంటాడు : లక్ష్మీమీనన్

సినీ నటి లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తాయి. కానీ, ఇక్కడపుట్టి పెరిగిన కొంతమంది భారతీయ మహిళలకు మాత్రం ఈ వివాహబంధంపై నమ్మకం లేదు. అలాంటివారిలో లక్ష్మీమ

సినీ నటి లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తాయి. కానీ, ఇక్కడపుట్టి పెరిగిన కొంతమంది భారతీయ మహిళలకు మాత్రం ఈ వివాహబంధంపై నమ్మకం లేదు. అలాంటివారిలో లక్ష్మీమీనన్ ఒకరు.
 
తన 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్‌ఫుల్ నటిగా గుర్తింపు పొందింది. ఈమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ, వివాహబంధంపై తనకు నమ్మకం లేదని, అందువల్ల పెళ్లి చేసుకోబోనని స్పష్టంచేసింది. 
 
అలాగని, తన జీవితంలో అండగా ఎవరూ ఉండరని అనుకోవద్దని, తనకు ఓ మగతోడు ఖచ్చితంగా ఉంటాడని తెలిపింది. అతనికి చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు ఉండాలన్నదే తన అభిమతమన్నారు. 
 
అయితే, దాన్ని సహజీవనం అని కూడా చెప్పలేనని తెలిపింది. దాన్ని ఎలా వర్ణించాలో తనకు అర్థం కావడం లేదని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని తాను భావించడం లేదని... పెళ్లి చేసుకోకపైనా వాటిని పొందవచ్చని తాను నిరూపిస్తానని అభిప్రాయపడింది.