1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Renu Desai second marriage related Twitter messages

మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో నా దేవుడు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆమె వైపు నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ, ఆమె నిర్ణయాన్ని మాత్రం పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేక

Renu Desai
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆమె వైపు నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ, ఆమె నిర్ణయాన్ని మాత్రం పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో రెండో పెళ్లి చేసుకోవద్దంటూ రేణూను వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
 
ఈనేపథ్యంలో ఓ అభిమాని రేణూను ఉద్దేశించి ఓ విజ్ఞప్తి చేశారు. 'మేడమ్... మీరు మరో వివాహం చేసుకోవద్దు. అలా చేస్తే, మీకు, బయటివారికి తేడా ఏముంటుంది? అసలు పవన్ కల్యాణ్, మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదు' అని కామెంట్ చేశాడు. 
 
దీనికి రేణూ దేశాయ్ ధీటుగానే స్పందించింది. 'ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారి తల్లులు, అక్క చెల్లెళ్లతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నాను' అని వ్యాఖ్యానించింది. 
 
అలాగే మరో అభిమాని స్పందిస్తూ, 'మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి. నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయండి' అని వ్యాఖ్యానించారు. ఇంకోవైపు, రేణూ దేశాయ్ వివాహానికి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారికి రేణూ దేశాయ్ ధన్యవాదుల తెలుపుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎన్టీఆర్ జీవిత చరిత్రను 3 గంటల్లో చూపించలేం.. 2 పార్టులుగా...