మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (10:06 IST)

మోదీకి పెళ్లి కాలేదా? ఆయన నా వరకైతే రాముడు: జశోదాబెన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివాహం కాలేదని మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై మోదీ సతీమణి జశోదాబెన్ షాక్‌కు గురయ్యారు. ఆనందీబెన్ వ్యాఖ్యలు విని షాకయ్యానని జశోదాబెన్ తెలిపారు. 2014 ల

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివాహం కాలేదని మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై మోదీ సతీమణి జశోదాబెన్ షాక్‌కు గురయ్యారు. ఆనందీబెన్ వ్యాఖ్యలు విని షాకయ్యానని జశోదాబెన్ తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన డిక్లరేషన్‌ పేపర్లలో తనకు పెళ్లి అయిందని మోదీ స్పష్టంగా వెల్లడించిన సంగతిని జశోదాబెన్ గుర్తు చేశారు.
 
ఆ పేపర్లలో తన పేరును కూడా చేర్చారని.. మధ్యప్రదేశ్ గవర్నర్ అలా మాట్లాడకుండా వుండాల్సిందని జశోదాబెన్ వ్యాఖ్యానించారు. ఆనందీబెన్ వ్యాఖ్యల పట్ల ప్రధాని ప్రతిష్ట దెబ్బతినే అవకాశం వుందని.. మోదీ చాలా గౌరవనీయుడని.. తనవరకైతే రాముడని జశోదాబెన్ స్పష్టం చేశారు. ఆమె ఈ విషయాలు మాట్లాడుతుండగా జశోదా సోదరుడు అశోక్ మోదీ మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. ఆనందీబెన్ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చిత్రీకరించినట్టు అశోక్ మోదీ తెలిపారు.