సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (10:43 IST)

పవన్ సీఎం మాత్రమే కాదు.. పీఎమ్ అవుతారు.. ఆ రెడ్ టవల్?: షకలక శంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అవుతారని.. ఆ తర్వాత పీఎం కూడా అవుతారని ఆయన వీరాభిమాని షకలక శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అవుతారని.. ఆ తర్వాత పీఎం కూడా అవుతారని ఆయన వీరాభిమాని షకలక శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. 
 
ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, అదే సగం బలమని చెప్పిన షకలక శంకర్, అలాంటి టవల్‌ను తాను కూడా వాడుతుంటానని తెలిపాడు. ఇకపోతే పవన్‌తో కలిసి సినిమాల్లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. పవన్..సీఎం అవుతుంటే, ఆయనతో కలిసి ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తానని చెప్పాడు. 
 
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలను సందర్శించారు. డుండ్రిగూడ మండలం పనసపొట్టు గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా కలుషిత నీరు వల్ల తాము జబ్బుల బారిన పడుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన పవన్... నీటి నమూనాలను తీసి, పరీక్షలు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు.