శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (14:07 IST)

'ఆపరేషన్ గరుడ'లో పవన్ పాత్ర అదేనా? చంద్రబాబు ఎందుకలా అన్నారు?

ఈమధ్య కాలంలో అప్పట్లో ఆపరేషన్ గరుడ అంటూ నటుడు శివాజీ తెరపైకి తెచ్చిన వ్యవహారం చర్చకు దారి తీస్తోంది. ఆమధ్య ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. భాజపా ఆడి

ఈమధ్య కాలంలో అప్పట్లో ఆపరేషన్ గరుడ అంటూ నటుడు శివాజీ తెరపైకి తెచ్చిన వ్యవహారం చర్చకు దారి తీస్తోంది. ఆమధ్య ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. భాజపా ఆడిస్తున్న నాటకమంటూ దుయ్యబట్టారు. తాజాగా నవనిర్మాణ దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరోసారి ఆపరేషన్ గరుడ మాటను మాట్లాడారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదనీ, అటువంటి పవన్ ఇప్పుడు తమపై విమర్శ చేయడం ఏంటని ప్రశ్నించారు. అన్యాయం చేసింది భాజపా అయితే తెలుగుదేశం పార్టీని విమర్శించడమేమిటంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రజలను పవన్ కళ్యాణ్ బాగా రెచ్చగొడుతున్నారనీ, ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని హితవు పలికారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి సైతం భాజపాను పల్లెత్తు మాట అనకుండా కేవలం తెదేపా ఏదో చేసిందన్నట్లు మాట్లాడటం చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమేనేమోనని అనుమానం వస్తుందంటూ చెప్పారు.
 
కాగా ఆపరేషన్ గరుడలో భాజపా, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డిల పాత్రలను నటుడు శివాజీ విపులీకరించిన సంగతి తెలిసిందే.