శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: గురువారం, 10 మే 2018 (14:06 IST)

పడ్డ కష్టాన్ని ప్రజలకు వివరించండి : చంద్రబాబు

ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో ఏ చిన్న ఘటన జరిగినా ఈజీగా తీసుకోవద్దని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. పోర్న్ వీడియోల వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, పోర్న్ వీడియోలను నియంత్రించడానికి, అరికట్టడానికి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర

ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో ఏ చిన్న ఘటన జరిగినా ఈజీగా తీసుకోవద్దని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. పోర్న్ వీడియోల వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, పోర్న్ వీడియోలను నియంత్రించడానికి, అరికట్టడానికి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటుచేస్తామని తెలియజేశారు. 
 
పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది భర్తీ పెరగాల్సి ఉందని, మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను సీసీ కెమెరాల పరిధిలోకి తేవాలని సూచించారు. నాలుగేళ్ళ కష్టం ఫలితాలు వచ్చే సమయం ఇదేనంటూ చేసిన పనులు, విజయాలు ప్రజలకు వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.