అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్
Ramachandra was ill, visited Manchu Manoj
వెంకీ సినిమాలో నటనతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు రామచంద్ర. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం అనారోగ్యం పాలయ్యారు. పక్షవాతం బారిన పడి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటుడు రామచంద్ర. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్.
ఈ రోజు హైదరాబాద్ లో రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను మంచు మనోజ్ పరామర్శించారు. రామచంద్రను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని మనోజ్ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మనోజ్ మాట్లాడారు. రామచంద్ర అనారోగ్యం విషయం ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ అన్నారు.
ఇక మంచు మనోజ్ తాజాగా మిరాయ్ సినిమాలో నటించాడు. ఆ సినిమా ట్రైలర్ ను చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి ప్రశంసలు ఇచ్చారు.