మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (21:11 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా ఎలా రాబట్టవచ్చో చెప్పిన చంద్రబాబు... ఎవరితో?

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో వివిధ పార్టీ ప్రముఖులను కలసి వారి మద్దతును కోరారు. ఉమ్మడి

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో వివిధ పార్టీ ప్రముఖులను కలసి వారి మద్దతును కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నివిడదీయటం వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరి, పక్షపాత ధోరణిని విపక్షాలవారికి వివరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాబట్టేందుకు అనుసరించవలసిన వ్యూహాలను గురించి  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ పార్టీ ప్రముఖులను పార్లమెంటులో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న అన్యాయాన్ని విశదీకరించారు. 
 
ఈ సందర్భంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్, కె.సి. వేణుగోపాల్, తారిక్ అన్వర్, జ్యోతిరాదిత్య సింధియాలను, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఫరూక్ అబ్దుల్లాను, అప్నా దళ్ పార్టీకి చెందిన శ్రీమతి అనుప్రియ పటేల్, శిరోమణి అకాలీదళ్ కు చెందిన శ్రీమతి హరిసిమ్రాత్ కౌర్ బాదల్ ను, బిజెపి కి చెందిన బండారు దత్తాత్రేయను, సమాజ్ వాది పార్టీకి చెందిన రాంగోపాల్ యాదవ్ ను, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదీప్ బందోపాద్యాయ్, డెరెక్ ఒ’బ్రిఎన్‌లను, టి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన జితేందర్ రెడ్డి, శ్రీమతి కవితలను, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పార్టీకి చెందిన మైత్రేయన్ లను తదితర పార్టీ ప్రముఖులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కలసి చర్చించారు.
 
ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణం లోని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో కలసి పుష్పాంజలి ఘటించారు.