శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 2 ఏప్రియల్ 2018 (20:42 IST)

ప్రత్యేక హోదా గురించి ఏం చెయ్యాలో త్వరలో చెప్తా... మాజీ సిఎం రోశయ్య(Video)

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. హోదా సాధన కోసం జెఎసిలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఎపి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఎన్నో రకాల ఆందో

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. హోదా సాధన కోసం జెఎసిలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఎపి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఎన్నో రకాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎపి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రత్యేక హోదా గురించి ఏం చెయ్యాలో నేను చెబుతాను. ఇది సమయం కాదు.. త్వరలో నేనే చెబుతా.. ఎలా చేస్తే బాగుంటుందో.. ఏవిధంగా ముందుకు వెళ్ళాలో కూడా సలహా ఇస్తానంటున్నారు రోశయ్య. తిరుపతిలో జరిగిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభల్లో పాల్గొన్న రోశయ్య మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
హోదా సాధించుకునేందుకు ఏవిధంగా ముందుకు వెళ్ళాలన్నది రోశయ్య చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యమాన్ని ఆపలేక సిఎం పదవికే రాజీనామా చేసిన రోశయ్య ప్రత్యేక హోదా సాధించుకునేందుకు సలహాలు ఇవ్వడం ఏంటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. మరి రోశయ్య ఎలాంటి సలహాలు యిస్తారో చూడాలి... చూడండి ఈ వీడియోను...