శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 28 మార్చి 2018 (22:32 IST)

ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు.. ప్రధానికి హీరో నిఖిల్ సూటి ప్రశ్న

కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు హీరో నిఖిల్. ఎపికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో సమాధానం చెప్పాలన్నారు నిఖిల్. ఎపికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎపిలో జరుగుతున్న పోరాటంపై కేంద్రం స్పందించాలి. ఎందుకు అసలు స్పందించలేదో క

కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు హీరో నిఖిల్. ఎపికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో సమాధానం చెప్పాలన్నారు నిఖిల్. ఎపికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎపిలో జరుగుతున్న పోరాటంపై కేంద్రం స్పందించాలి. ఎందుకు అసలు స్పందించలేదో కూడా అర్థం కావడం లేదు. నేను సినిమా షూటింగ్‌లకు వెళ్ళే సమయంలో చాలా మంది కమ్యూనిస్టు నేతలను చూశా.. వారు చేస్తున్న పోరాటం నన్ను కదిలించింది.
 
అందుకే ట్వీట్ చేశా. ట్విట్టర్ వేదికగా ప్రధానిని ప్రశ్నించా. ప్రత్యేక హోదా ఇవ్వండంటూ అడిగా. తప్పేముందు.. నన్ను తప్పుబడుతూ కొంతమంది ప్రేక్షకులు మెసేజ్‌లు చేశారు. మరికొంతమందైతే సమర్థించారు. అందరూ ఒకలా ఉండరని అందరికీ తెలిసిందే. విమర్శలకు బాధపడడం, పొగిడితే ఎగిరి గంతేయడం నాకు తెలియదు. ఎప్పుడూ ఒకేలా ఉంటాను.. నేను అనుకున్నదే చేస్తానంటున్నారు హీరో నిఖిల్. కిర్రాక్ పార్టీ హిట్ ఆనందాన్నిస్తోంది. మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వెళతానంటున్నారు.