మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (13:02 IST)

మోడీ కాళ్ళను తాకి దండం పెట్టిన విజయసాయి... ఆశీర్వదించిన ప్రధాని

రాజ్యసభలో ఓ ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.

రాజ్యసభలో ఓ ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఛైర్మన్ వెంకయ్య నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభకు వచ్చారు. ప్రధాని సభలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే సభ్యులు మాత్రం నినాదాలు చేశారు. 
 
ఇంతలో ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి నమస్కారం చేయగా, దానికి ప్రధాని ప్రతినమస్కారం చేశారు. అనంతరం మోడీ కాళ్లకు వంగి దండం పెట్టారు. వంగి మోడీ కాళ్లను తాకారు. మోడీ ప్రతినమస్కారం చేస్తూ విజయసాయిరెడ్డి భుజంపై చేయివేసి ఆశీర్వదించారు. ఈ పరిణామం రాజ్యసభలో చోటుచేసుకుంది. 
 
మరోవైపు, ప్రధాని ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా ప్రధానితో సహా సభ్యులు ఎవరు బయటకు వెళ్లకుండా సభలోనే ఉండిపోయారు. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి... ప్రధాని మోడీని కలిసి నమస్కారం చేశారు.