శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 27 మార్చి 2018 (19:34 IST)

చంద్రబాబు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు... శివాజీ సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నారు.. నాకు తెలిసిన వారితో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వేర్వేరుగా హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కలిసి ఉందాం.. పార్టీలోకి వచ్చెయ్ శివాజీ అంటున్నారు. నాకు రాజకీయ పార్టీలలోకి వెళ్ళే

తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నారు.. నాకు తెలిసిన వారితో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వేర్వేరుగా హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కలిసి ఉందాం.. పార్టీలోకి వచ్చెయ్ శివాజీ అంటున్నారు. నాకు రాజకీయ పార్టీలలోకి వెళ్ళే ఆలోచన అస్సలు లేదు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసి చివరకు ఇబ్బందుల్లో పడ్డా. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. నేను హోదా కోసం ప్రాణమిస్తా.
 
హోదా కోసం పోరాటం చేసేవారికి అండగా నిలుస్తా.. అది నా నైజం.. అంతేతప్ప నాకు ఎవరితో వెళ్ళాలని, ఏ పార్టీతోనైనా పెట్టుకోవాలని అస్సలు లేదు. అన్ని పార్టీలను కలుపుకుని హోదా కోసం ఒక మీటింగ్ బాబు పెట్టారు. ఆ మీటింగ్‌కు నన్ను పిలిచారు. కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒక్కసారి అలా వెళ్ళానంటే ఇక నా గురించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయంటున్నారు నటుడు శివాజీ.