1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP MP MuraliMohan Comments on Pawan Kalyan

పవన్‌ను చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారు... అందుకే ఇదంతానా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడాన్ని ఆ పార్టీలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నటుడు, ఎంపీ మురళీ మోహన్ బాహాటంగా తన మనసులో వున్న మాటలను చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కు తెదేపాలోని కీలక నాయకుల

TDP MP MuraliMohan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడాన్ని ఆ పార్టీలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నటుడు, ఎంపీ మురళీ మోహన్ బాహాటంగా తన మనసులో వున్న మాటలను చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కు తెదేపాలోని కీలక నాయకుల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతకుముందు వరకూ పొగిడిన పవన్ ఒక్కసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఏదైనా తప్పు జరిగి వుంటే ఆ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడుతో చెప్పే చనువు పవన్ కళ్యాణ్‌కు వుందని అన్నారు. అలాంటిది చంద్రబాబు పట్ల పవన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిస్తే ఎదురెళ్లి తీసుకొచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు కారు దాకా వెళ్లి మరీ ఎక్కించి వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. 
 
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేస్తుందనీ, ఎలాంటి తప్పులకు తావివ్వదని పునరుద్ఘాటించారు మురళీ మోహన్.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలుగు జర్నలిస్టు అసోసియేషన్ (తేజస్)కు‌ నూతన కార్యవర్గం...