శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (16:57 IST)

జైళ్ళల్లో ఖైదీల రద్దీని తగ్గించరా? సుప్రీం కోర్టు సీరియస్

ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం అక్షింతలు వేసింది. దేశంలోని జైళ్ళల్లో సామర్థ్యానికి మించి ఖైదీలతో నిం

ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం అక్షింతలు వేసింది. దేశంలోని జైళ్ళల్లో సామర్థ్యానికి మించి ఖైదీలతో నిండిపోవడంతో సుప్రీం కోర్టు మండిపడింది. 
 
ఖైదీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో.. రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని రెండు వారాల్లోపు నివేదిక రూపంలో ఇవ్వని పక్షంలో.. కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాల్సి వుంటుందని జైళ్ల డైరక్టర్ జనరళ్లను హెచ్చరించింది. 
 
ఖైదీల మానవ హక్కుల విషయంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని సుప్రీం ఫైర్ అయ్యింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ముంబై, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్, అసోం, బీహార్ రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.