శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (13:09 IST)

ట్రిపుల్ తలాక్ తర్వాత బహుభార్యత్వంపై సుప్రీం కోర్టు నోటీసులు

ఇస్లాంలో భార్యకు విడాకులిచ్చే భర్త మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతిని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అలాగే ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఏడు నెలల క్రితం తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థ

ఇస్లాంలో భార్యకు విడాకులిచ్చే భర్త మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతిని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అలాగే ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఏడు నెలల క్రితం తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రస్తుతం ముస్లింలలో బహుభార్యత్వం, నిఖాపై దృష్టి సారించింది. ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. 
 
ఈ మేరకు నిఖా, బహుభార్యత్వంపై పిల్‌ను స్వీకరించిన ధర్మాసనం.. వీటిపై వైఖరేంటో చెప్పాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇస్లాం పద్ధతి ప్రకారం నిఖా హలాలా అనేది విడాకుల తర్వాత కూడా కలిసి వుండాలని భావించే మహిళలకు ఉద్దేశించింది. భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారంతో కొంతకాలం పెళ్లి పేరుతో కలిసి ఉండడం నిఖా ముతా. దీన్ని కాంట్రాక్ట్ వివాహం అంటారు. ఈ వివాహంలో మహిళకు ఎలాంటి అధికారాలుండవు. రాత ప్రకారం ఈ కాంట్రాక్ట్ వివాహం కుదుర్చుకుంటారు. 
 
ఈ నేపథ్యంలో నిఖా, హలాలా, నిఖా ముతా, నిఖా మిస్యార్ తదితర వివాహ పద్ధతులతోపాటు బహుభార్యత్వాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా చట్ట విరుద్ధం కూడా అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.