శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (12:28 IST)

ఆ కారణాలతో బాధపడేవారు లోకం విడిచి వెళ్లొచ్చు : సుప్రీంకోర్టు

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా ఐదుగురు న్యాయమూర్తులతో కూ

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 
 
స్వచ్ఛంద మరణంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అందుకు అనుమతించింది. నిజానికి ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం దీనిపై తీర్పును వెల్లడించింది. అలాగే, స్వచ్ఛంద మరణంపై నియమ నిబంధనలను కేంద్రం తయారు చేసి, న్యాయస్థానానికి అందజేసింది. వీటిని పరిశీలించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. 
 
విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మరణించాలని భావించే వారికి వారు కోరిన అవకాశాన్ని దగ్గర చేయాలంటూ కీలక రూలింగ్ ఇచ్చింది. బతికేందుకు ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలుగా తేలిపోయిన తర్వాత, స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే హక్కు న్యాయమైన హక్కేనని పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పౌరులకు గౌరవంగా మరణించే హక్కు ఉందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు, విధివిధానాలకు తగ్గట్టుగా వారు తమ కోరికను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. 
 
అయితే అందుకు సదరు రోగుల కుటుంబసభ్యుల నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది. వీరితో పాటు ఆ రోగి కోలుకోవడం సాధ్యం కాదని చెప్పిన వైద్యుల బృందం అనుమతి కూడా ఉండాలని సూచించింది. సజీవ వీలునామాను తీసుకుని రోగి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు హైకోర్టుకు వెళితే.. పరోక్ష కారుణ్యం అవసరమో లేదో నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీర్పును వెలువరిస్తూ.. అలాంటి రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.