శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (09:10 IST)

సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు.. ప్రియా ప్రకాష్ వారియర్

మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన వీడియోతో ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దాఖలైన కేసుపై స్టే విధించాలని.. ప్రియా వారియర్ నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ వ

మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన వీడియోతో ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దాఖలైన కేసుపై స్టే విధించాలని.. ప్రియా వారియర్ నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ వివాదంపై విచారణ జరిపి ప్రియా వారియర్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పుతో ఒరు ఆదార్ లవ్ చిత్ర యూనిట్, ప్రియా వారియర్‌పై కేసును నమోదు చేయకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో ప్రియావారియర్‌తో పాటు ఆ సినిమా యూనిట్ ఊపిరి పీల్చుకుంది. 
 
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమకు ఊరట లభించిందని ప్రియా వారియర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. సుప్రీం కోర్టుకి కృత‌జ్ఞ‌త‌లు.. మాణిక్య మలరయా పూవై పాటపై అభ్యంతరాలు తెలుపుతూ తనపై.. దర్శకుడిపై కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించిన అడ్వకేట్ హారిస్ బీరన్‌కి.. మద్దతు తెలిపిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియాకు థ్యాంక్స్ అంటూ ప్రియా వారియర్ పేర్కొంది.