శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (14:04 IST)

రామమందిరం కోసం గెలిపిస్తే.. ట్రిపుల్ తలాక్‌‌ను చట్టం చేస్తారా?: ప్రవీణ్ తొగాడియా

వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎండగట్టారు. బీజేపీకి ఓటేసింది రామమందిర నిర్మాణం కోసమే కానీ.. ట్రిపుల్ తలాక్ కోసం కాదంటూ ప్రవీణ్ తొగాడియా విమర్శలు గుప్పించారు. అయోధ్య

వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎండగట్టారు. బీజేపీకి ఓటేసింది రామమందిర నిర్మాణం కోసమే కానీ.. ట్రిపుల్ తలాక్ కోసం కాదంటూ ప్రవీణ్ తొగాడియా విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ చేపడుతుందనే ఉద్దేశంతోనే బీజేపీకి వీహెచ్సీ మద్దతిచ్చిందని తొగాడియా గుర్తు చేశారు.
 
కానీ రామమందిర నిర్మాణంలో బీజేపీ ఎందుకు జాప్యం చేస్తోందని ప్రవీణ్ తొగాడియా నిలదీశారు. ప్రజలు గెలిపించి.. రామ మందిర నిర్మాణం కోసమేనని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేసేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 
 
ఇదిలా ఉంటే.. అయోధ్య వివాదం 70 సంవత్సరాల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో.. రికార్డులో వున్న ఆధారాలను బట్టి రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని భూ వివాదానికి సంబంధించిన కేసు మాదిరిగానే పరిగణిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేసు పరిస్థితి ఎలాంటిదైనా సరే.. అయోధ్య-బాబ్రీ వ్యవహారాన్ని భూ వివాదంగా పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంకా కేసు తదుపరి విచారణను మార్చి 14కి సుప్రీం వాయిదా వేసింది.