ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Sandeep
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (13:44 IST)

ట్రిపుల్ తలాఖ్: ప్రధాని మోదీపై మండిపడ్డ అసదుద్దీన్

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017కి ప్రతిస్పందిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదల్ ముస్లిమీన్ (ఏఐఎమ్ఐఎమ్) ప్రెసిడెంట్ అసదుద్దిన్ ఒవైసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తలాక్ విధానాలన్నింటినీ, ముస్ల

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017కి ప్రతిస్పందిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదల్ ముస్లిమీన్ (ఏఐఎమ్ఐఎమ్) ప్రెసిడెంట్ అసదుద్దిన్ ఒవైసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తలాక్ విధానాలన్నింటినీ, ముస్లిం వ్యక్తిగత చట్టాలన్నింటిని నిర్మూలించడమే మోదీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 
 
ట్రిపుల్ తలాఖ్ ప్రాముఖ్యాన్ని మోదీ తెలుసుకోలేకపోతున్నారని విమర్శించారు. ముస్లింల వివాహం ఒక పౌర ఒప్పందం అని, ఒప్పందం యొక్క ఉల్లంఘన శిక్షా నిబంధనలకు దారి తీయాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలన్నారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లు అన్యాయంతో కూడుకున్నదని, దాని ప్రభావం ఎక్కువగా పేద ముస్లిం స్త్రీలపైనే పడుతుందని వ్యాఖ్యానించారు.
 
రాజ్యాంగంలో సూచించిన ప్రాథమిక హక్కులకు ఈ బిల్లు విరుద్ధమైనదని చెప్పారు. వ్యక్తి జైలుకు వెళితే భార్యకు జీవనాధార భత్యం ఎవరు ఇవ్వాలి, ఆమె యొక్క రక్షణా బాధ్యతను ఎవరు స్వీకరించాలో ప్రధానమంత్రి జవాబు చెప్పుకోవాలని ఒవైసి చెప్పారు.
 
రాజ్యసభలో ప్రస్తుతం ఆమోదించడానికి సిద్ధంగా ఉన్న ఈ బిల్లు ప్రకారం ఎవరైనా పదాల రూపేణా లేదా పరికరాలలో భార్యకు తలాఖ్ చెబితే వారికి శిక్ష తప్పదు. దాదాపు 3 సంవత్సరాలు జైలులో గడపవలసి ఉంటుంది. విడాకులిచ్చిన భార్యకు, పిల్లలకు అతడు జీవనాధారం కల్పించవలసి ఉంటుంది. ఈ నేరానికి బెయిల్ సదుపాయం లేదు.