శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (16:38 IST)

పాకిస్థాన్‌కు చెప్పు దెబ్బ: ఆన్‌లైన్‌లో జత చెప్పులు ఆర్డర్ చేసిన బీజేపీ నేత..

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ప్రవర్తించింది. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాకిస్థాన్ తీసుకోవడంపై సర్వత్రా విమర

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ప్రవర్తించింది. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాకిస్థాన్ తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..  పాక్ ప్రవర్తనకు షాక్ ఇచ్చే దిశగా బీజేపీ నేత ''చెప్పు దెబ్బ''లాంటి నిరసన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబారికి చెప్పులు పంపాలని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత తేజీంగర్ కొత్త నిరసనకు తెరలేపారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ చిరునామాతో ఆన్‌లైన్‌లో ఒక జత చెప్పులు కొనుగోలుకు ఆయన ఆర్డర్ పెట్టారు. 
 
ఈ ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను శుక్రవారం ట్వీట్ చేశారు. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాక్ తీసుకోవడం దారుణమని, వారికి పాక్ చేసిన అవమానానికి నిరసనగా బీజేపీ కార్యకర్తంతా ఇదే తరహాలో ఆ దేశ రాయబారికి చెప్పులు పంపాలని పిలుపు నిచ్చారు. పాకిస్థాన్ మన చెప్పులు కావాలని కోరుకుంటోందని చెప్పారు.