మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:24 IST)

ఒక్క అత్యాచారం ఖరీదు రూ.6 వేలా? సుప్రీంకోర్టు ప్రశ్న

ఒక్క అత్యాచారం ఖరీదు ఆరు వేల రూపాయలా అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిర్భ‌య తరహా ఘ‌ట‌న త‌ర్వాత మ‌హిళ‌ల‌పై ఎలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వా

ఒక్క అత్యాచారం ఖరీదు ఆరు వేల రూపాయలా అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిర్భ‌య తరహా ఘ‌ట‌న త‌ర్వాత మ‌హిళ‌ల‌పై ఎలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దీంతో పాటు అత్యాచారానికి గురైన బాధితుల‌కు ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్భ‌య మూల‌ధ‌న ప‌థ‌కం కింద న‌గదును అంద‌జేస్తుంది. ఈ నగదు మొత్తం అతి తక్కువగా ఉండటంతో పాటు అనేకమంది బాధితులకు సరిగా అందడంలేదనే విమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాగే, 24 రాష్ట్రాలు, కేంద్ర‌ప్రాంతాల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  
 
ఈ కేసు విచారణలో భాగంగా, అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం‌పై సుప్రీం మండిప‌డింది. మధ్యప్రదేశ్‌లో 1,951 మంది బాధితులున్నారు. వారికి మీరు రూ.6 వేల నుంచి రూ.6,500 ఇస్తున్నారని పేర్కొంది. ఈ ఆర్థిక సాయంపై జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఒక లైంగికదాడి ఖరీదు రూ.6 వేలా? ఇంత స్వల్పమొత్తం అందజేసి అత్యాచార బాధితులపై ప్రభుత్వం దయచూపుతున్నదా? అని మధ్యప్రదేశ్ ప్ర‌భుత్వంపై మండిప‌డింది. కేంద్రం విడుదల చేసిన నిర్భయ నిధుల నుంచి పెద్ద మొత్తంలో మధ్యప్రదేశ్‌కు అందినా బాధితులకు తక్కువ మొత్తం అందించడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అలాగే, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కూడా సుప్రీం తప్పుబట్టింది.